Thursday, November 21, 2024

ప్రజలను మోసగించడంలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందు దొందే

- Advertisement -
- Advertisement -

నారాయణపేట: ప్రజలను మోసం చేయడంలో బిఆర్‌ఎస్ , కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ అన్నారు. శుక్రవారం నారాయణపేటలోని కేఆర్‌పి గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, కొండయ్య, జంగయ్య, కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పి. శ్రీనివాసులుతో కలిసి మాట్లాడుతూ పథకాలు అమలు చేయకుండా బిఆర్‌ఎస్ , కర్ణాటకలో గ్యారెంటీలు అమలులో తోకముడిచిన కాంగ్రెస్ ఇక్కడ గ్యారెంటీలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు .. రంగారెడ్డి పథకంలో క్క మోటారు ప్రారంభించి మూడు గంటల్లో మూసేసి ప్రజలకు అదిగో ఇదిగో నీళ్లు వచ్చాయని కోట్ల రూపాయలతో ప్రజాధనాన్ని ప్రకటనల పేరుతో దుర్వినియోగం చేసి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వస్తాం జూరాల ద్వారా నీటిని తీసుకొని జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జిల్లాలో మరికల్ , యాధిర్ హైవే , కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేసి రైలు నడిపిస్తామని అన్నారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను తుంగలో తొక్కిందని విమర్శించారు.

బీఆర్‌ఎస్ , కాంగ్రెస్ మోసాలను ప్రజలు భరించే స్థితిలో లేరని, ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారని రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో అక్టోబర్ 1న జరిగే దేశ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనను, బహిరంగ సభను విజయవంతం చేయాలని డి.కె. అరుణ ఉమ్మడి జిల్లా ప్రజలను కోరారు. ప్రధాని నరేంద్రమోడీ 1వ తేదీన రూ. 13,545 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని తెలిపారు.

వేల కోట్ల అభివృద్ది పనుల కోసం వస్తున్న ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ సహయ న్యాయవాది జి. రఘువీర్ యాదవ్ , రాష్ట్ర నాయకులు పంది రామచంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్, కోశాధికారి సిద్ది వెంకట్రాములు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ శ్యాం సుందర్ గౌడ్ , నియోజకవర్గ కన్వీనర్ జి.కె. నర్సిములు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్య రాఘపాల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News