Thursday, December 19, 2024

శనివారం రాశి ఫలాలు(30-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: చేపట్టిన పనులు దిగ్విజయంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.ఇంటాబయటా విజయం వరిస్తుంది.

వృషభం: కొత్త, పాత మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి.పాత బాకీలు వసూలు అవుతాయి.సుదూర ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో కలహాలు కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు పోటీ తత్వం కలిగే కాలంగా చెప్పవచ్చు.

మిథునం: అనుకున్న పనులలో ఇబ్బందులు ఎదురైనా నిలకడ మీద సకాలంలో పూర్తి చేస్తారు.కీలక నిర్ణయాలలో చేసే ఆలోచనలు మీ ఆలోచనలై ఉండాలి.లాభాలు వచ్చే దిశగా ఉంటుంది.

కర్కాటకం: ఆరోగ్య విషయంలో మెలకువ చాలా అవసరం.చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు.నూతన గృహ నిర్మాణ పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

సింహం: భూములు,గృహాలు కొనుగోలు చేస్తారు.శుభకార్యాలలో పాల్గొంటారు. ఇతరుల నుండి కీలక సమాచారం అందుతుంది.సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మీరు చేసే నిర్ణయం తుది నిర్ణయం గా ఉంటుంది.

కన్య: స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది.కొన్ని కారణాల చేత ఆగిపోయిన పనులు పూర్తి చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖుల నుండి వచ్చే ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

తుల: ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొని నిలబడతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు.చేపట్టిన పనులలో ఆలస్యమైన సకాలంలో పూర్తి చేస్తారు.రుణాలు చేసే అవకాశాలు ఉన్నాయి.వెనుక ముందు ఆలోచించండి.

వృశ్చికం: సంతానం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది.కొందరితో ఏర్పడిన పేచీలు పెటాకులు అవుతాయి.కొన్ని విషయాలలో ఊరట చెందుతారు.
ధనస్సు: సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.వివాహ,ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

మకరం: రుణ బాధలు బాధిస్తాయి.ఉద్యోగస్తులకు కార్యాలయాలలో అధిక ఒత్తిడి పెరుగుతుంది.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు చాలా అవసరం.శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.ఆకస్మిక లాభాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

కుంభం: ఇంటాబయటా మీదేపై చేయిగా ఉంటుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వారితో కష్టసుఖాలు సంభాషిస్తారు. బంధువులు అక్కరకు వచ్చినట్టుగా ఉన్నా అవసరానికి రారు అని అర్థమవుతుంది.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు.చేపట్టిన కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి-ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు.ఆకస్మికంగా వచ్చే లాభాలకు ఉప్పొంగి పోతారు.

సోమేశ్వరశర్మ : 8466932223,9014126121

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News