Monday, December 23, 2024

సమ్మె విరమణ చేసిన అంగన్‌వాడీలు

- Advertisement -
- Advertisement -

ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌తో ఆసంఘం ప్రతినిధులు సమావేశం
సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీ

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో గత 19 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం నిరవధికంగా చేస్తున్న సమ్మెను రాష్ట్ర అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు విరమించారు. శుక్రవారం మంత్రుల నివాసంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌తో సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అంగన్ వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి సమ్మె చేయాల్సి వచ్చిన పరిస్థితులను వారు వివరించారు. సమస్యలను, డిమాండ్లను సిఎం కెసిఆర్ ర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీనిచ్చి సమ్మెను విరమించాలని సూచించారు. వినోద్ కుమార్ హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు అంగన్ వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ ( ఏ.ఐ.టీ.యు.సీ., సీ.ఐ.టీ.యు. ) నాయకులు జయలక్ష్మి, కరుణ కుమారి, చందన, రజిత, పద్మ, వెంకటమ్మ, యూసుఫ్, సమ్మయ్య ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News