Monday, November 25, 2024

30,000 మంది ఉద్యోగులపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో స్టార్టప్‌లు (చిన్న సంస్థలు) వేగంగా ఎంత ఉత్సాహంగా ప్రారంభిస్తున్నాయో? అంతే త్వరగా చతికిలబడుతున్నాయి. గత సంవత్సరం(2022) వరకు భారతీయ స్టార్టప్‌లకు గొప్ప వాతావరణం ఉంది. ఎక్కువ మంది యువత లేదా ఉద్యోగులు స్టార్టప్ కంపెనీల వైపు పరుగులు తీశారు. అయితే దేశంలో స్టార్టప్‌ల స్వర్ణయుగం ముగిసిపోయిందని, వాటి పరిస్థితి మరింత దిగజారిపోతోందని తెలుస్తోంది. ఫైనాన్స్ పోర్టల్ మనీకంట్రోల్ లేఆఫ్ ట్రాకర్ ప్రకారం, ఈ సమాచారం బయటకు వచ్చింది. తాజా ఎడ్‌టెక్ స్టార్టప్ బైజుస్‌లో 4000 ఉద్యోగాల కోతతో 2022 సంవత్సరం నుండి భారతీయ స్టార్టప్‌లలో ఉద్యోగాల కోతలు 30,000 దాటాయి. ఇప్పటి వరకు దేశంలోని 95 స్టార్టప్‌లు సుమారు 31,965 మంది ఉద్యోగులను తొలగించాయి.  స్టార్టప్‌లు తమ ఖర్చులను తగ్గించుకోవాలని, లాభాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నందుకే ఈ ఉద్యోగుల లేఆఫ్ అని ప్రకటించాయి. 2023లోనే దాదాపు 13,000 మంది స్టార్టప్‌ల ఉద్యోగులు ఉపాధి పొందనున్నారు.

లేఆఫ్ ట్రాకర్ ప్రకారం, 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 49 స్టార్టప్‌లు దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించాయి. దీనిలో ఎక్కువగా ఉద్యోగుల కోత బైజులోనే ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎడ్‌టెక్ స్టార్టప్ ఈ వారం పునర్నిర్మాణ ప్రక్రియను ప్రకటించింది. దీని కింద కంపెనీ సుమారు 4000 మంది ఉద్యోగులను బయటికి పంపుతోంది. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది బైజుస్‌లో తొలగించిన ఉద్యోగుల సంఖ్య 10,000 వరకు ఉండవచ్చు. వాస్తవానికి చాలా స్టార్టప్‌లు తొలగించిన ఉద్యోగుల అసలు సంఖ్యను వెల్లడించవు, లేదా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయవు. అందువల్ల దేశంలోని స్టార్టప్‌ల నుండి వేటుకు గురైన ఉద్యోగుల సంఖ్య 31,965 కంటే చాలా ఎక్కువగా ఉండొవచ్చు. గతేడాది 2022లో 51 స్టార్టప్‌లు లేఆఫ్‌లు చేయగా, ఈ ఏడాది కేవలం 9 నెలల్లోనే 49 స్టార్టప్‌లు తమ పేర్లను ఈ జాబితాలో చేర్చాయి. బైజూస్, డున్జో వంటి సంస్థలు తొలగింపునకు సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు పెద్ద సంఖ్యలో తొలగింపు ప్రక్రియను చేస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News