Saturday, December 21, 2024

గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడి అరాచకాలు

- Advertisement -
- Advertisement -

చేర్యాల: చేర్యాల పట్టణంలోని గురుకుల బాలుర పాఠశాలలో ఆర్ట్ టీచర్‌గా పని చేస్తున్న వేదాంత చారి అనే ఉపాధ్యాయుడు అరాచకాలకు పాల్పడుతున్నాడు. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని అమానుషంగా కొట్టి, గాయపరిచి, నానా బూతులు తిట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రాళ్ల జనగామ గ్రామానికి చెందిన వోజ్జల హర్షవర్ధన్ అనే విద్యార్థిని ని గత పది రోజుల క్రితం వేదాంత చారి ఉపాధ్యాయుడు బాలుడి మెడపై స్కే ల్‌తో కొట్టడంతో విద్యార్థికి గాయాలయ్యాయి,

భయాందోళనకు గురైన విద్యార్థి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో గత రాత్రి తీవ్ర జ్వరానికి లోనై , పిడుచు రావడంతో, తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు పా ఠశాలకు చేరుకొని బాలుడిని ఆసుపత్రి కి తరలించి చికిత్స చేస్తున్న సందర్భం లో ఒం టిపై గాయం మరకలు ఉండటంతో ఏమిటని వి ద్యార్థిని ప్రశ్నించగా, టీచర్ బండారం బట్టబయలైంది. శుక్రవారం రోజున విద్యార్థి తండ్రి వోజ్జల శ్రీనివాస్ గురుకుల పాఠశాలకు చేరుకొని సంఘటనపై ప్రశ్నించగా టీచర్ వే దాంత చారి మరియు ప్రిన్సిపల్ అందుబాటులో లేకపోవడంతో వైస్ ప్రిన్సిపల్ ను నిలదీశారు. తన కొడుకుకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

వేదాంత చారి ఉపాధ్యాయుడు మాకొద్దు..
వేదాంత చారి ఉపాధ్యాయుడు చేసే పనులు, తిట్టే భూతులు, కొట్టే పద్ధతిని చూ సి విద్యార్థులు ఈ ఉపాధ్యాయుడు మాకొద్దు అంటూ విద్యార్థులు విలేకరులతొ తమ గోడు వెళ్లబోసుకున్నారు. బయట చెప్పే వి ధం గా లేకుండా నానా బూ తులు మాట్లాడుతుంటడని విద్యార్థులు తివ్ర అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వేదాంత చారి ఉపాధ్యాయుడు పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News