- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లు నిండిపోవడంతో భక్తులు క్యూలైన్‌లో నిలిచి ఉన్నారు. భక్తుల దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. గురువారం శ్రీవారిని 66,233 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,486 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.71 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలించారు. రాత్రి పది గంటల వరకు ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉంటుంది. వన్య మృగాల కదలికలు తగ్గడంతో టిటిడి నిర్ణయం తీసుకుంది. చిరుతల సంచారంతో రెండు నెలలుగా టిటిడి ఆంక్షలు విధించింది.
Also Read: తెలంగాణకు పరిశ్రమలు తరలిపోవడంపై జగన్ సర్కార్‌పై బ్రాహ్మణి ఫైర్
- Advertisement -