- Advertisement -
లక్నో: పెళ్లి కాకుండానే గర్భవతి అయిన కన్నకూతురును కుటుంబ సభ్యులు తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హాపుడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హాపుడ్ జిల్లాలో ఓ గ్రామంలో యువతి, యువకుడితో ప్రేమ వ్యవహారం నడిపింది. ఇద్దరు శారీరకంగా కలుసుకోవడంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వెంటనే గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై సోదరుడు, తల్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. రైతులు గమనించి కొన ఊపరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె 70 శాతం గాయపడినట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి సోదరుడు, తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Also Read: గూఢచారిని కరిచిన బైడెన్ పెంపుడు శునకం
- Advertisement -