Monday, December 23, 2024

ప్రాణం తీసిన 30 రూపాయలు

- Advertisement -
- Advertisement -

లక్నో: 30 రూపాయల కోసం గొడవ జరగడంతో 17 సంవత్సరాల యువకుడిని ముగ్గురు వ్యక్తులు గొంతు నులిమి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బాఘ్‌పత్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కెహెచ్‌ఆర్ ఇంటర్ కాలేజీలో ఓ విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. 30 రూపాయల కోసం విద్యార్థితో సొంత గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గొడవకు దిగారు. ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ముగ్గురు కలిసి యువకుడి గొంతు నులమడంతో అక్కడే చనిపోయాడు. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై ఎక్కడా గాయాలు లేవని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: తెలంగాణకు పరిశ్రమలు తరలిపోవడంపై జగన్ సర్కార్‌పై బ్రాహ్మణి ఫైర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News