Tuesday, November 5, 2024

ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

వారణాసి: ముంబై నుంచి వారనాసి వెళుతున్న ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానానికి సోషల్ మీడియా ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వారణాసి విమానాశ్రయంలో శనివారం ఉదయం ఉద్విగ్న వాతావరణం నెలకొంది.


బాంబు బెదిరింపు గురించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విమానం కెప్టెన్‌కు తెలియచేశారు. వారణాసి విమానాశ్రయంలో విమానం సురక్షితంగా దిగేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తీసుకుంది. వేరే రన్‌వేపై విమానం ల్యాండ్ కాగా వెంటనే అందులోని ప్రయాణికులను కింందకు దించివేశారు. విమానాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది బాంబు వంటి వస్తువేదీ లభించలేదు.

ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని, బాంబు బెదిరింపు గురించి సమాచారం అందగానే ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని వారణాసి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. విమానం ముంబై నుంచి వారణాసికి వస్తున్నందున ముందు జాగ్రత్తగా వేరే రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేయించామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News