Thursday, April 17, 2025

గడ్డపోతారం పంచాయతీ కార్మదర్శిపై సస్పెన్షన్ వేటు

- Advertisement -
- Advertisement -

జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పంచాయతీ కార్మదర్శిపై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. సౌఖ్య ఎలైట్ వెంచర్ పేరిట ఘరానా మోసానికి పాల్పడినట్లు పంచాయతీ కార్యదర్శి నరేష్ బాబును ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామపంచాయతీ పరిధిలోని 72, 83, 84, 85, 89, సర్వే నెంబర్లలో అక్రమంగా ఇంటి నెంబర్లను ఘరానా మోసానికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి నరేష్ బాబుపై డిఎప్పీవో సతీష్ రెడ్డి విచారణ చేసి రిపోర్టు జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అందించారు. ఈ వ్యవహారంలో పంచాయతీని సస్పెండ్ చేస్తూ సర్పంచ్, ఉపసర్పంచ్ సాలకవర్గ సభ్యులకు జిల్లా కలెక్టర్ శోకజ్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News