Monday, December 23, 2024

ఉచిత విద్యుత్ పై విపక్షాల పిచ్చికూతలు

- Advertisement -
- Advertisement -

ఓర్వలేనితనంతో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కోలేటి దామోదర్ ధ్వజం

మన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే రైతులు ఆనందంగా పట్టపగలే తమకు కావలసినప్పుడే నీళ్లు వాడుకొంటుంటే తట్టుకోలేని శకున పక్షులు పిచ్చికూతలు కూస్తున్నాయంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ విపక్షాలపై ధ్వజమెత్తారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణలో ఏదైతే జరుగదని జరుగకూడదని వాళ్లనుకున్నారో అందుకు పదిరెట్లు జరుగుతున్న అభివృద్ధిని చూసి అసహనంతో అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. కలలో కూడా ఊహించలేని ప్రగతి పధాన తెలంగాణ వ్యవసాయరంగం దూసుకుపోతుంటే ఓర్వలేనితనంతో ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో కానిదేదో తెలంగాణలో జరుగుతుంటే తట్టుకోలేక ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి మనసురాక లేని లోపాలను ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాటి నుంచే సిఎం కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొంటూ విద్యుత్ రంగంలో అంచెలంచెలుగా ముందుకు సాగుతూ ఒక్కో రికార్డును బ్రేక్ చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాల నోటివెంట ఔరా ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్య పరిచారు. సేద్యానికి 24 గంటలు నిరంతర ఉచిత విద్యులు సరఫరా చేస్తుంటే విమర్శకుల నోళ్లు నాలుక మడతేసుకొని కొత్త రాగాలందుకొంటున్నాయని ఎద్దేవా చేశారు. ప్రగతిని కండ్లరా చూసి కూడా గుర్తించలేని మూర్ఖులు కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ప్రతిపక్షాలను దుయ్యబట్టారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక ప్రగతితో రైతులు ఇప్పుడు కంటినిండా నిద్రపోతున్నారన్నారన్నారు.

అత్యంత కీలకమైన వ్యవసాయరంగానికి 2018 జనవరి ఒకటో తేదీ నుంచి 24 గంటలపాటు కరెంటును అందించిన ఘనత కూడా సిఎం కెసిఆర్‌దేనని తెలియజేశారు. ఇప్పుడు ఎక్కడా కోతలు లేవు లో వోల్టేజీ సమస్యలు రావడంలేదని ఎక్కడా ఫిర్యాదులు లేవని అలాంటప్పుడు ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా ప్రజలు నమ్మ స్థితిలో లేరని స్పష్టం చేశారు. విపక్షాలు తలకిందులుగా తపస్సు చేసిన వారికి అధికారమనేది అందని ద్రాక్షేనని వ్యాఖ్యానించారు. మళ్లీ వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని హ్యాట్రిక్ సిఎంగా కెసిఆర్ రికార్డు సృష్టించడం ఖాయమని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా ఉచిత విద్యుత్ దుష్ప్రచారం మానకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని విఫక్షాలను హెచ్చరించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News