ప్రపంచ స్థాయిలో క్రికెట్‌తో తమ దీర్ఘకాల అనుబంధాన్ని బలోపేతం చేసుకుంటూ, సీగ్రమ్ రాయల్ స్టాగ్ ఒక వినూత్నమైన, లీనమయ్యే AI- ఆధారిత అభిమానుల అనుభవాన్ని ‘ఏ బిలియన్ ఫిల్మ్స్ ఫర్ ఏ బిలియన్ ఫ్యాన్స్’ (నూరు కోట్ల అభిమానుల కోసం నూరు కోట్ల సినిమాలు) విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశం యొక్క అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ముగ్గురు, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ ఈ చిత్రం లో కనిపించనున్నారు. క్రికెట్‌తో ముడిపడి ఉన్న, జీవితానికంటే మిన్న అయిన భావోద్వేగాలను మరింతగా పెంపొందిస్తూ, బ్రాండ్ కొత్త తరం యువ క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది, ఈ అభిమానులలో అధిక శాతం మంది పెద్దలుగా భారతదేశంలో తమ మొదటి ప్రపంచ కప్‌ను చూస్తున్నారు.
ఈ ప్రపంచ కప్ భారతదేశంలో జరుగుతోంది. ఇది ఇప్పటికే “గ్రేటెస్ట్ వరల్డ్ కప్” గా పేర్కొనబడుతుంది. బ్రాండ్ యొక్క ‘లివ్ ఇట్ లార్జ్’ ఫిలాసఫీతో సమకాలీకరించడం తో, AI-ఇంటిగ్రేటెడ్ ప్రచారం ప్రతి అభిమాని , ఈ క్రికెటర్లతో కూడిన వ్యక్తిగతీకరించిన చిత్రంలో భాగం అయ్యే అవకాశాన్ని అందిస్తుంది. క్రియేటివ్ ఏజెన్సీ భాగస్వాములైన FCB ఇండియా, డిజిటల్ ఏజెన్సీ భాగస్వాములైన డెన్సు ఇండియా, టెక్నాలజీ పార్టనర్ ఆర్టిజెన్‌ల ఈవెంట్స్, అనుభవపూర్వక పరిష్కారాలు & మీడియా భాగస్వాములైన వేవ్‌మేకర్‌తో భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రచారం రూపొందించబడింది. ఈ ప్రచారం సంచలనాత్మకమైనది. ఇక్కడ ప్రతి అభిమాని తమ కలను మాత్రమే కనడం కాకుండా, పెద్దగా జీవించగలుగుతారు.
సరళీకృత వినియోగదారు ప్రయాణాన్ని అందించడం ద్వారా నేటి యువత, మరీ ముఖ్యంగా డిజిటల్ స్థానికులను దృష్టిలో ఉంచుకుని అభిమానుల అనుభవం తీర్చిదిద్దబడింది. రీ జనరేటివ్ AI యొక్క శక్తితో సెల్ఫీ, వాయిస్ నమూనా అత్యుత్తమ అభిమానుల అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ సాధనాలతో, ఈ ప్రచారం , ప్రతి అభిమాని రాయల్ స్టాగ్ లైవ్ ఇట్ లార్జ్ స్టార్ కాస్ట్‌లో భాగంగా తమను తాము చూసుకునేలా ఒక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి జనరేటివ్ AI సాంకేతికత, మెషిన్ లెర్నింగ్ యొక్క శక్తిని ఉపయోగిస్తుంది. ఈ ఆవిష్కరణ సహాయంతో, ప్రతి అభిమాని చిత్రం యొక్క వ్యక్తిగతీకరించిన సవరణలను సృష్టించవచ్చు. ముఖాన్ని ప్రతిబింబించే అల్గారిథమ్‌లు అభిమానుల ప్రత్యేక ముఖ లక్షణాలను ప్రధాన చిత్రంలో పాత్రలపై ఖచ్చితంగా మ్యాప్ చేస్తాయి. అదనంగా, కేవలం సంక్షిప్త వాయిస్ నమూనాతో ఇది అభిమానుల స్వరం యొక్క టోన్, పిచ్, సూక్ష్మ నైపుణ్యాలను కూడా అనుకరిస్తుంది. మొత్తంగా, ఈ ప్రచారం వినియోగదారుల ప్రయాణాన్ని అసాధారణమైన ఇంకా వ్యక్తిగత అనుభవంగా మారుస్తుంది. వినియోగదారుల అనుభవం కూడా అభిమానులకు హద్దులు దాటి తమ అభిమాన ఆటగాళ్లు, ప్రపంచ కప్ ట్రోఫీకి చేరువయ్యే అవకాశాన్ని ఇస్తుంది.
లీనమయ్యే రీతిలో, మరపురాని అనుభూతిని అందించడానికి డిజిటల్, ప్రింట్, రేడియో, OOH అంతటా విస్తరించిన అధిక-డెసిబెల్ సమగ్ర ప్రణాళిక ద్వారా ప్రచారం విస్తరించబడుతుంది.
పెర్నోడ్ రికార్డ్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మొహింద్రా మాట్లాడుతూ.. “ స్టేడియంలోని అత్యంత శక్తివంతమైన వాతావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పంచుకోవాలని రాయల్ స్టాగ్ లక్ష్యంగా పెట్టుకుంది. ICC యొక్క భాగస్వామిగా, ప్రతిచోటా ఉన్న క్రికెట్ వీరాభిమానులకు నిజంగా “లైవ్ ఇట్ లార్జ్” అనుభవాన్ని అందించడానికి AI అనుమతిస్తుంది. ఈ సంవత్సరం, మేము ప్రతి అభిమానికి ఈ ప్రత్యేకమైన AI ప్లాట్‌ఫారమ్ ద్వారా తమ స్వంత లైవ్ ఇట్ లార్జ్ స్టోరీని రూపొందించే శక్తిని అందిస్తున్నాము, ఇది వారి విజయ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే బ్రాండ్ యొక్క నిబద్ధతతో ఏకీకృతం అవుతుంది. ఒక వైపు మేము క్రికెట్ వారసత్వాన్ని వేడుక చేసుకుంటూనే, మరోవైపు బ్రాండ్ ఎంగేజ్‌మెంట్‌ను విస్తృతం చేయడానికి, క్రికెట్ అభిమానులను మునుపెన్నడూ లేని విధంగా తమ అభిమాన క్రీడలో లీనమయ్యేలా ప్రేరేపించడానికి మేము అత్యాధునిక సాంకేతికతను స్వీకరించాము” అని అన్నారు.
FCB ఇండియా ప్రెసిడెంట్, అభినవ్ కౌశిక్ మాట్లాడుతూ.. “అనుభవం మాత్రమే కరెన్సీగా ఉన్న డిజిటల్ వాసులు వున్న ఈ యుగంలో, రాయల్ స్టాగ్ వంటి సాంస్కృతిక చిహ్నం ఈ సంవత్సరంలోని అతిపెద్ద క్రీడా ప్రదర్శనలో ‘పెద్దది’ అని సూచించే పనిని ఎలా చేయగలదు. ఇది సంక్షిప్త ప్రారంభం మాత్రమే, ఈ ఆలోచన ప్రతి క్రికెట్ అభిమాని తమ సొంత, ప్రత్యేకమైన ‘లివ్ ఇట్ లార్జ్’ అనుభవాన్ని సృష్టించడానికి నిజంగా అనుమతించినందుకు మేము సంతోషిస్తున్నాము. సాంకేతికత శక్తి తో కూడిన ఈ సృజనాత్మకత శక్తి బ్రాండ్ ఎంగేజ్‌మెంట్‌ను అందించడమే కాకుండా బ్రాండ్‌పై ప్రేమ బహుళ రెట్లు మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని అన్నారు.
వేవ్‌మేకర్ – సౌత్ ఆసియా సీఈఓ అజయ్ గుప్తే మాట్లాడుతూ.. “క్రికెట్ ప్రపంచ కప్ నిస్సందేహంగా అత్యంత ప్రసిద్ధ క్రీడా ప్రాపర్టీలలో ఒకటి, ఈ ప్రపంచ కప్ 2023 మహోన్నతమైనదిగా చెప్పబడుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా, మేము బ్రాండ్ సినర్జీలను విస్తరించడం, ప్రతి క్రికెట్ అభిమానికి ప్రత్యేకమైన, మరపురాని, థ్రిల్లింగ్ ‘లివ్ ఇట్ లార్జ్’ అనుభవం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
డెన్సు క్రియేటివ్ ఇండియా సీఈఓ అమిత్ వాధ్వా మాట్లాడుతూ.. “భారత క్రికెట్ అభిమానులలో ఆధునిక సృజనాత్మకతను ఎలా నింపవచ్చో తెలియజేసేందుకు ఈ ప్రచారం మాకు ఒక పెద్ద వేదికను అందించింది. క్రీడలు, వినోదంతో మా కనెక్షన్‌ని మెరుగుపరచడానికి, సమృద్ధి చేయటానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఈ బహుముఖ ప్రచారం, చిరస్మరణీయమైన క్షణాలు, అనుభవాలను తమతో చిరకాలం నిలిచిపోయేలా చేసుకుంటూనే, అభిమానులను తమకు ఇష్టమైన క్రీడలో మరింత లోతుగా పాల్గొనేలా ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు.
ఆర్టిజెన్స్ ఈవెంట్స్ & ఎక్స్‌పీరియన్షియల్ సొల్యూషన్స్ వ్యవస్థాపక భాగస్వామి ఆదిత్య జోషి మాట్లాడుతూ.. “ఈ వినూత్న ప్రచారానికి సాంకేతికత భాగస్వాములుగా, మేము AI, మెషిన్ లెర్నింగ్‌ని ఒకచోట చేర్చి, సామాజిక కరెన్సీ, వికారియస్ థ్రిల్స్ కోసం తహతహలాడే జనరేషన్ లార్జ్‌తో కనెక్షన్‌ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. మునుపెన్నడూ చూడనటువంటి లీనమయ్యే అనుభవాలను సృష్టిస్తున్నాము” అని అన్నారు. ICC పురుషుల ప్రపంచ కప్ భారతదేశంలో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19, 2023 వరకు జరగనుంది. అన్ని ICC ఈవెంట్‌లకు అసోసియేట్ భాగస్వామి గా రాయల్ స్టాగ్ వ్యవహరిస్తోంది.