మన తెలంగాణ/ హైదరాబాద్: చిన్నారులు కోసం నిమ్స్‌లో పీడియాట్రిక్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు క్లినిక్ ఉంటుందన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ మొదటిగా గుండె సంబంధిత సమస్యలపై చూశామని దశలు వారీగా అన్ని విభాగాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.
ఇప్పటి నుంచి చిన్నారులకు సర్జరీలు కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ సహాకారంతో సర్జరీలు నిర్వహిస్తామని తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు నుంచి కూడా దాదాపుగా 500 మందికి పైగా చిన్నారులును తీసుకొని తల్లితండ్రులు నిమ్స్‌కి వచ్చారని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు నిమ్స్ ఆసుపత్రి అంటే ఒక్క నమ్మకం అని అన్నారు. పంజాబ్, నేపాల్, మహారాష్ట్ర, సిక్కిం, చత్తీస్ గడ్‌లను నుంచి నిమ్స్ కు వస్తున్నారని వెల్లడించారు. నిమ్స్‌లో చిన్నారుల సర్జరీల కోసం 5 కోట్లతో పరికరాలను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.