Saturday, January 11, 2025

పాక్‌పై భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

హాంగ్‌జౌ: ఆసియా క్రీడల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శనివారం జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో భారత్ 102 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రీడల్లో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. 8వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. 11వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ రెండో గోల్ సాధించి పెట్టాడు. ఇక 17వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ మరో గోల్ నమోదు చేశాడు.

ఇక 30వ నిమిషంలో సుమిత్ భారత్‌కు నాలుగో గోల్ సాధించి పెట్టాడు. ఇక హర్మన్‌ప్రీత్ 33, 34 నిమిషాల్లో గోల్స్ సాధించాడు. ఇక వరుణ్‌కుమార్ 41, షంషేర్ సింగ్ 46, లలిత్ కుమార్ 49వ నిమిషంలో గోల్స్ అందించారు. వరుణ్‌కుమార్ 54వ నిమిషంలో భారత్ తరఫున పదో గోల్ చేశాడు. ఇక పాక్ తరఫున 38వ నిమిషంలో మహ్మద్ ఖాన్, 45వ నిమిషంలో అబ్దుల్ రాణా గోల్స్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News