Saturday, December 21, 2024

నిష్క్రమించిన నైరుతి.. అరకొర వర్షాలతోనే సరి

- Advertisement -
- Advertisement -

14జిల్లాల్లో బొటాబొటి వర్షాలే
భూపాలపల్లి జిల్లాలో రికార్డు వర్షం
అట్టడుగున జోగులాంబ గద్వాల

మనతెలంగాణ/హైదరాబాద్:  వర్షాకాలం ముగిసిపోయింది. నైరుతి రుతుపవనా లు నిష్క్రమించాయి..వ్యవసాయరంగానికి ప్రాణం పోస్తూ దేశ ఆర్ధిక ప్రగతికి చోదకశక్తిగా నిలిచే రుతుపవనాలు ఈసారి అరకొర వర్షాలతోనే సరిపెట్టా యి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్ర భావం వల్ల జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ వర్షాకా లం నాలుగు నెలల పాటు కురవాల్సిన సాధారణ వ ర్షపాతం 720.4 మిల్లీమీటర్లు కాగా, సెప్టెంబర్ నెల చివరి వరకూ 843.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

సాధారణ వర్షపాతంతో పోలిస్తే కేవలం 16శాతం మాత్రమే అధికంగా వర్షాలు పడ్డాయి.ఇది కూడా సాధారణ వర్షపాతంలోనే చేరిపోయింది. వ ర్షాకాలం ముగిసి పోవడంతో ఇక తెలంగాణ రాష్ట్రం లో ఈశాన్య రుతుపవనాల ద్వారా పెద్దగా వర్షాలు కురిసే అవకాశం తక్కువే అని వాతావరణ రంగం ని పుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలపై వ్యవసాయరంగం పెట్టుకున్న ఆశలు అంతగా నేరవేరకుండానే వర్షాకాలం ముగిసిపోయింది. జూన్ రెం డవ వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించాల్సిన రుతుపవనాలు పది రోజులకు పైగా ఆలస్యంతో ప్రవేశించాయి. పైగా నాలుగు నెలల కాలంలో వర్షపాతంలోనూ సమతుల్యత లేకుండా పోయింది. ఒక నెల అధిక వర్షాలు కురిస్తే , మరొక నెల లోటు వర్షాలతో కాలం గడిచిపోయింది. వర్షానికి వర్షానికి మధ్య కూడా జాప్యం బాగా పెరిగిపోవటంతో ఖరీఫ్‌లో సాగు చేసిన పైర్లు ఎదుగుదల దశలోనే వర్షపు చినుకుల కోసం తపించి బెట్టకుగురయ్యాయి. జూన్‌లో 129.4 మి.మి వర్షపాతం నమోదు కావాల్సివుండగా, ఆనెలలో 72.6 మి.మి వర్షమే కురిసింది. జూన్‌నెల 44శాతం లోటు వర్షపాతంలో ముగిసింది.జులై నెలలో 229.1 మి.మి సాధారణ వర్షపాతానికి గాను 490మి.మి వర్షం కురిసింది. ఈ నెల 114శాతం అధికవర్షపాతంతో ముగిసింది. ఆగస్టు నెలలో 217.4 మి.మి సాధారణ వర్షపాతం నమోదు కావాల్సివుండగా, 79.7 మి.మి వర్షంతోనే రుతుపవనాలు సరిపెట్టాయి. ఈ నెలలోనే ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగు చేసిన పైర్లు తగినంత వర్షపాతం లేక నేలలో తేమశాతం తగ్గిపోయి అధికశాతం బెట్టకు గురికావాల్సివచ్చింది. నెలంతా 62శాతం లోటు వర్షపాతంలో ముగిసిపోయింది. సెప్టెంబర్‌లో 162.7 మి.మి సాధారణ వర్షపాతానికి గాను 200.9 మి.మి వర్షం కురిసింది. ఈ నెలలో 35శాతం అధికవర్షపాతం నమోదయింది.
14జిల్లాల్లో బొటాబొటీ వర్షాలు!
33 జిల్లాల్లో 14 జిల్లాల్లో బొటాబొటీ వర్షాలే కురిశాయి. కొమ రం భీం, ,మంచిర్యాల, ములుగు, మహబూబాబాద్ , ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల, సూర్యాపేట, నల్లగొండ, యాదాధ్రి భువనగరి జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదయింది. మిగిలిన 19 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయింది. ఈ ఏడాది వర్షాకాలంలో కొన్ని జిల్లాల్లో రికార్డు స్థా యిలో కుండ పోతగా వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వాగులు వంకలు పొటేత్తాయి. కుండపోత వర్షంతో పలు జిల్లాల్లోని లోతట్టు గ్రామాలు వదరనీటితో ము నిగాయి. ప్రాణనష్టంతోపాటు పంటలు దెబ్బతని వ్యసాయరంగానికి అ పార నష్టం వాటిల్లింది. రోడ్లు కోతకు గురయ్యాయి. వదర ఉధృతికి వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో అత్యధికం గా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1294.8 మి.మి వర్షం కురిసింది. తెలంగాణ వర్షపాతపు చరిత్రలోనే ఇది రికార్డుగా మిగిలిపోయింది. 926.6 మి.మి సాధారణ వర్షపాతానికి గా ను ఈ జిల్లాలో 1294.8 మి.మీ వర్షం కురిసింది. అం తే కాకు ండా నైరుతి రుతుపవనాల వల్ల ఈ వర్షాకాలంలో అతితక్కువ వర్షపాతం నమోదయిన జిల్లాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 385.3 మి.మి సాధారణ వర్షపాతానికిగాను అత్యల్పంగా 360.9 వర్షపాతంలో అట్టడుగు జిల్లాగా మిగిలిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News