Friday, December 20, 2024

మిస్ క్వీన్ తెలంగాణగా అనూష కంఠం

- Advertisement -
- Advertisement -

తెలంగాణకి చెందిన యువతి  మిస్ క్వీన్ తెలంగాణ గా అనూష కంఠం, ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముస్కాన్ నాయర్ మిస్ క్వీన్ ఆంధ్ర  టైటిల్ కైవశం చేస్తుకున్నారు. తుది పోటీలో మణప్పురం మిస్ సౌత్ ఇండియా టైటిల్‌ను కేరళకు చెందిన హర్ష శ్రీకాంత్ గెలుచుకున్నారు. మణప్పురం మరియు డీక్యూ పెగాసస్ గ్లోబల్  నిర్వహించిన 21వ ఎడిషన్ మిస్ సౌత్ ఇండియా 2023 టైటిల్ కేరళకు చెందిన హర్ష శ్రీకాంత్‌ కైవశం చేసుకోగా తమిళనాడుకు చెందిన అక్షతా దాస్ ఫస్ట్ రన్నరప్‌గా, కేరళకు చెందిన రోస్మిన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

శనివారం రాత్రి కలూర్ గోకులం కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పోటీల్లో సాజ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ సిఎండి సాజన్ వర్గీస్ విజేతకు, మొదటి రన్నరప్‌కు టైటిల్ అందచేశారు, వీవర్స్ విలేజ్ యజమాని శోభా విశ్వనాథ్ రెండో రన్నరప్‌గా టైటిల్ అందచేశారు. ఈ కార్యక్రమంలో పెగాసస్ చైర్మన్ డాక్టర్ అజిత్ రవి పాల్గొన్నారు.

ఆదివారం నాడు హైదరాబాద్  నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణపురం మరియు పెగసుస్(Pagasus) సంస్థల ప్రతినిధులు Dr. అజిత్ రవి ఈ పోటీల వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్నరు ఈ పోటీలో ఐదు రాష్ట్రల కి చెందిన 20 మంది అందమైన యువతులు టైటిల్‌ పోరుకు ఎంపికయ్యారు. హోరాహోరీగా తలపడ్డారు అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News