Monday, December 23, 2024

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో గెలుస్తాం

- Advertisement -
- Advertisement -

ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దు
నకిరేకల్‌లో వీరేశం గెలుపునకు కృషి చేయాలి
ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన్ను ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సమష్టి కృషితో పనిచేయాలన్నారు. నకిరేకల్‌లో వీరేశం గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

నకిరేకల్లో వీరేశంను గెలిపిస్తే తనకు ముఖ్యమంత్రి అయినంత సంతోషంగా ఉంటుందని కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించారు. గతంలో కాంగ్రెస్ జెండాపై గెలిచిన వ్యక్తి పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సిఎం అయినా ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు సిఎం, సిఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎమ్మెల్యేల అవినీతి, అరాచకాలపై ఉద్యమించేదుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దైద రవీందర్, వేదాసు శ్రీధర్ బాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎద్దులపురి కృష్ణ, ఏర్పుల పరమేష్, దేశపాక రాజేష్, నూతి సైదులు, కొసనపు అశోక్, మెట్టు మనోహర్, బెల్లం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News