Saturday, December 21, 2024

ఎప్పుడో ప్రకటించాల్సినవి… ఇప్పుడు ప్రకటించారు : ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రానికి ఎప్పుడో ఇవ్వాల్సిన పసుపు బోర్డు , ఏండ్ల కింద భూమిని కేటాయించినప్పటికీ ఇవ్వని గిరిజన యూనివర్సిటీని.. ఇప్పుడు ప్రకటిస్తారా? అని ప్రధాని మోడీపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావు మండిపడ్డారు. ఆదివారం మంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో కూర్చుని ప్రధాని.. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తున్నారు. తల్లిని చంపి బిడ్డని బతికించారు అంటున్నారు.

మా బియ్యం కొనమంటే, నూకలు తినే అలవాటు మీ ప్రజలు అలవాటు చేసుకోమని మీరు, మీ మంత్రులు అవమానించిన విషయం మరచిపోయారా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని హామీలు ఇస్తున్నారు? సిగ్గు అనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ఎప్పుడో ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఇవ్వాళ ఇస్తారా? ఏండ్ల కింద భూమిని కేటాయించినప్పటికీ, ఇవ్వని గిరిజన యూనివర్సిటీ ని ఇప్పుడు ప్రకటిస్తారా? భూమి కేటాయింపులు లేని ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు భవనాల్లో గిరిజన యూనివర్సిటీని నడిపిస్తారా? అని మంత్రి మండిపడ్డారు. బయ్యారం ఉక్కు మా హక్కు. ఆ ఫ్యాక్టరీ ఏమైంది?!  మాకు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మీరు తరలించకపోయి, డబ్బాలు కడిగే ప్రాజెక్టు మాకు ఇచ్చింది నిజం కాదా! విభజన చట్టంలోనే ఇచ్చిన హామీలను విస్మరించారు. ఒక్కటైనా నెరవేర్చారా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రధాని ఎన్నికల జిమ్మిక్కులను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని వెల్లడించారు. రాష్ట్రంలో రేపటి అధికారం మళ్ళీ బిఆర్ఎస్ దే అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News