Sunday, December 22, 2024

నదిలో కారు బోల్తాపడి ఇద్దరు డాక్టర్లు మృతి

- Advertisement -
- Advertisement -

కొచ్చి : కేరళ లోని గోతురుత్తు వద్ద ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పెరియార్ నదిలో కారు బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు మృతి చెందారు. వారితో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ గూగుల్ మ్యాప్ సహాయంతో కారును నడుపుతూ వెళ్తుండగా పొరపాటున రూటు తప్పి నదిలోకి కారు దూసుకెళ్లిందని పోలీస్‌లు చెప్పారు. భారీ వర్షాల కారణంగా ఎదురుగా ఏముందో సరిగ్గా కనిపించక ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పోలీస్‌లకు, ఫైర్‌సర్వీస్ బృందానికి తెలియజేశారు. ఇద్దరు డాక్టర్ల మృతదేహాలను వెలికి తీయడానికి గజ ఈతగాళ్లను నదిలోకి దించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News