మనతెలంగాణ/హైదరాబాద్: భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఢిల్లీలో ఆదివారం కలిశారు. శివరాజ్ గౌడ్ భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి నియోజకవర్గంలో అత్యధికంగా బిసి ఓటర్లు ఉన్నారని, కొండా లక్ష్మణ్ బాపూజీ తర్వాత నియోజకవర్గంలో బిసిలు ఎమ్మెల్యేగా గెలవలేదని ఆయన ఖర్గేతో వివరించారు.
ఈసారి నియోజకవర్గ ప్రజలు బిసిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఖర్గే ఆయన వివరించారు. ఖర్గే సైతం దీనికి సానుకూలంగా స్పందించి బిసిలకు భువనగిరి నియోజకవర్గ టికెట్ ఇచ్చేందుకు కమిటీలో చర్చిస్తామని, ఎవకీ ఇంకా టికెట్ కన్‌ఫమ్ చేయలేదని ఖర్గే శివరాజ్ గౌడ్‌తో తెలిపారు. అనంతరం పచ్చిమట్ల శివరాజు గౌడ్ తన పూర్తి బయోడేటాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందించారు.