Saturday, December 21, 2024

కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో తలపై పలకతో కొట్టిన టీచర్… విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం రామంతాపూర్‌లో విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. హోమ్ వర్క్ చేయలేదని మొన్న యుకెజి విద్యార్థిని టీచర్ పలకతో కొట్టింది. తలపై పలకతో కొట్టడంతో హేమంత్ అనే విద్యార్థి స్పృహ తప్పిపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ ఇవాళ హేమంత్ చనిపోయాడు. వివేక్‌నగర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్కూల్ ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగారు. ధర్నా తరువాత మృతదేహాన్ని తల్లిదండ్రులు స్వగ్రామానికి తరలించారు. గతంలో చదువులు సరిగా చెప్పడం లేదని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో టీచర్లు పిల్లలపై ప్రతాపం చూపిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. చిన్న పిల్లలను శారీరంగా హింసిన్నట్టు తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: కొవిడ్ వ్యాక్సిన్ సృష్టికర్తలకు నోబెల్….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News