- Advertisement -
మన తెలంగాణ / హైదరాబాద్ : ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ప్రభుత్వాన్ని చాలా బద్నాం చేశారని ఆయనన్నారు. భవిష్యత్తులోనూ ఈ ఫ్యాక్టరీ నిర్మించబోమని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీకి కేటాయించిన భూమిని పభుత్వం వెనక్కి తీసుకుంటుందని మంత్రి తెలిపారు. భవిష్యత్తు అవసరాలు గ్రహించకుండా ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకించారని అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో నూతనంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళవారం మంత్రి కెటిఆర్ వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
- Advertisement -