Thursday, December 19, 2024

డయాబెటిస్, మల్టిపుల్ స్లిరోసిస్ నివారణకు కొత్త “ఇన్‌వెర్స్ ”వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శరీరం వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి అంతర్గత రక్షణ వ్యవస్థ ఉంటుంది. ఆరోగ్యానికి హాని కలిగించే వైరస్ శరీరంలో ప్రవేశిస్తే దానిపై దాడి చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ రక్షణ వ్యవస్థ (ఇమ్యూనిటీ) పొరపాటున తన సొంత శరీరం పైనే దాడి చేస్తుంటుంది. దీని ఫలితంగా కండరాల క్షీణత ( మల్టిపుల్ స్లిరోసిస్) , టైప్1 డయాబెటిస్ వంటి స్వయం ప్రతిరక్షక (ఆటో ఇమ్యూన్ డిసీజెస్) వ్యాధులు సంభవిస్తుంటాయి. ఈ విధమైన ఆటోఇమ్యూన్ వ్యాధులను ఇమ్యూనిటీ వ్యవస్థకు ఏమాత్రం భంగం కలగకుండా అడ్డుకట్ట వేసే కొత్త ఇన్‌వెర్స్( విలోమ ) వ్యాక్సిన్‌చే పరిశోధకులు ప్రయోగాలు చేశారు. ఈ విచిత్రమైన వ్యాక్సిన్ ఇమ్యూన్ వ్యవస్థ లోని ఒక నిర్ధిష్ట అణువు యొక్క మెమరీని చెరిపివేయ గలుగుతుంది. ఆరోగ్యానికి హాని కలిగించే వైరస్ లేదా బ్యాక్టీరియాను గుర్తించి దాడి చేయాలని ఇమ్యూన్ వ్యవస్థకు ఈ ఇన్‌వెర్స్ వ్యాక్సిన్ ఆదేశిస్తుంది. చికాగో యూనివర్శిటీకి చెందిన ప్రిట్జెకెర్ స్కూల్ ఆఫ్ మోలిక్యులర్ ఇంజినీరింగ్ (పిఎంఇ) పరిశోధకులు

ఈ ఇన్‌వెర్స్ వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించారు. ఇమ్యూన్ వ్యవస్థ లోని ఒక నిర్దిష్ట మోలిక్యూల్ మెమరీని ఈ వ్యాక్సిన్ తొలగిస్తుంది. దానివల్ల మల్టిపుల్ స్లీరోసిస్, టైప్1 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థిరిటిస్ వంటి వ్యాధుల్లో కనిపించే ఆటోఇమ్యూన్ చర్యలను వ్యాక్సిన్ అరికట్ట గలుగుతుందని రుజువైంది. ఆటోఇమ్యూన్ చర్యల వల్ల వ్యక్తి ఆరోగ్యవంతమైన కండరాలపై కూడా దాడి జరుగుతుంది. అలాంటి దాడి జరగకుండా ఈ వ్యాక్సిన్ అడ్డుకుంటుంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగాల గురించి జర్నల్ నేచర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ లో వెలువడింది. సాధారణంగా ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్సకు వైద్య ప్రక్రియలు ఉన్నప్పటికీ వాటివల్ల అనేక దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. ఆరోగ్యవ్యవస్థను కాపాడే ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. అందువల్ల ఇన్‌వెర్స్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో అలాంటి దుష్ఫలితాలు ఏవీ కలగవని పరిశోధకులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News