Saturday, November 23, 2024

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్ సి

- Advertisement -
- Advertisement -

5 % ఐఆర్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రిటైర్డ్ ఐఎఎస్ ఎన్.శివశంకర్ సారథ్యంలో కమిటీ
సభ్యుడిగా మరో రిటైర్డ్ ఐఎఎస్ బి.రామయ్య

ఆరు నెలల్లో నివేదిక సమర్పణకు ఆదేశం ఉత్తర్వులు జారీ

రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.840కోట్ల భార

మనతెలంగాణ/ హైదరాబాద్:  ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చె ప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం నూతన పే రివిజన్ కమిటీ (పిఆర్‌సి)ని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎన్.శివశంకర్‌ను, సభ్యునిగా రిటైర్డ్ ఐఎఎస్ అ ధికారి బి.రామయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ కమిటీ ఆరు నెలల లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పిఆర్‌సికి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధుల ను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆ దేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం మ ధ్యంతర భృతి (ఐఆర్)ను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 శా తం మధ్యంతర భృతి చెల్లింపుతో ప్రభుత్వంపై ఏటా రూ.840 కోట్ల అదనపు భారం పడనున్నట్లు అంచ నా. నెలకు సుమారుగా రూ.70 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అధికార వర్గాలు పే ర్కొంటున్నాయి.
2018లో 27 శాతం ఐఆర్
రాష్ట్రంలో 2009లో ఐఆర్ 11 శాతం ప్రకటించగా, 2014లో 15 శాతం, 2018లో 27 శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఉద్యోగులకు 5 శాతం ఐఆర్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం బిస్వాల్ నేతృత్వంలో మొదటి పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసింది. 2018 లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలును సవరించాలని సిఫార్సు చేస్తూ ఆ కమిటీ 2020 డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీంతో సిఎం కెసిఆర్ 2021 మార్చి 22న ఉద్యోగులకు సవరించిన వేతన స్కేళ్లను ప్రకటించారు. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా 9.17 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన వేతనాలను అందించింది.
నేడు సిఎంను కలువనున్న ఉద్యోగ సంఘాల నేతలు
పిఆర్‌సి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు మంగళవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలుపుననున్నారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, ఉద్యోగుల హెల్త్ కార్డు తదితర అంశాలపై టిజిఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టిఎన్‌జిఒ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్ తదితరులు సిఎం కెసిఆర్‌తో చర్చించనున్నట్లు తెలిసింది.
పిఆర్‌సి అంటే ఏమిటి..?
పే రివిజన్ కమిటీ(పిపీఆర్‌సి) ప్రతి ఐదు సంవత్సరాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పింఛన్ దారులకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పిస్తుంది. వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్‌మెంట్‌లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా పిఆర్‌సి కమిటీ కూర్పు చేస్తుంది. తాజా ద్రవ్యోల్బణం, అయిదేళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించి, గత పిఆర్‌సి నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి శాస్త్రీయంగా తాజా మూల వేతానాలను ఈ కమిటీ ప్రతిపాదిస్తుంది.
మధ్యంతర భృతి(ఐఆర్)
ప్రతీ పిఆర్‌సి కమిటీ వేసిన తరువాత సకాలంలో వేతన సవరణ జాప్యానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు. ఇది ప్రస్తుత కాల ధరల సూచిక, ద్రవ్యోల్బణం విలువలపై ఆధారపడుతుంది. పిఆర్‌సి అమలులోకి వచ్చిన వెంటనే ఐఆర్ రద్దవుతుంది.

Shiv Shankar

B Ramaiah

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News