Saturday, November 16, 2024

నేడు సిద్దిపేటకు రైలు

- Advertisement -
- Advertisement -

రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడి

త్వరలో తిరుపతి, బెంగళూరుకు రైళ్లు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేటకు రైలు రావాలన్న కలను నేటితో నిజం కానుంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల ప్రత్యేక చోరవతో రైలు కల నేరవేరింది. రైల్వే శాఖ ఆద్వర్యంలో మనోహార బాద్ నుంచి కొత్త పల్లి రైల్వే లైన్‌లో భాగంగా సిద్దిపేట వరకు నిర్మించిన పనులు శరవేగంగా పూర్తయ్యాయి. జిల్లాలో రైల్వే లైvన్ కోసం చేపట్టిన భూ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు చేసింది. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు రైల్వే లైన్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. ఇప్పటికే సెప్ట్రీ కమీషనింగ్ ఇన్స్‌పెక్షన్ టెస్టు సైతం పూర్తి చేశారు. పలు ద పాలు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే సిద్దిపేట రైల్వే స్టే షన్ పనులు పూర్తి అయ్యాయి. అలాగే రైల్వే స్టేషన్‌లో ఐదు రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చే యాల్సి ఉండగా ఇందులో మూడు ట్రాక్‌లు పూర్తి చేసి సిద్ధ్దంగా ఉంచారు. ఇందులో మొదటి , మూడవ లైన్‌లో ప్యాసింజర్ రైలు, నాలుగవ లైన్‌లో గూడ్స్, ఐదవ లైన్‌ను ప్యాకింగ్, మరమ్మత్తుల ఇంజన్‌ల పార్కింగ్‌ల కోసం ఉపయోగిస్తారు. నే డు దేశ ప్రదాని నరేంద్ర మోడీ పలు రాష్ట్రాలకు సంబంధించిన కొత్త రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించనున్నా రు. ఇందులో భా గంగా సిద్దిపేట రైలును సైతం ప్రదాని మోడీ ప్రారంభించనున్నారు. రానున్న రోజులలో సిద్దిపే ట నుంచి తిరుపతి, బెంగుళూర్‌కు ప్యాసింజర్ రైలు నడవనుంది. అలాగే ఎలక్ట్రీక్ రైల్వేలైన్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభు త్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ ఎలక్ట్రీక్ రై ల్వే లైన్ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి కావడంతో రైల్వే ర వాణా మరింత మెరుగు పడనుంది. సిద్దిపేటకు రైలు రావడంతో ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మం త్రి హరీశ్‌రావు పట్టుదలతోనే సిద్దిపేటకు రైలు వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైలు కల నిజమైంది…. మంత్రి తన్నీరు హరీశ్‌రావు
సిద్దిపేటకు రైలు రావాలన్న కల నేటితో నేరవేరింది. ఒకప్పు డు ఎన్నికల నినాదంగా ఉన్న రైలు నినాదాన్ని నేడు సిఎం కె సిఆర్ నిజం చేసి చూపంచారు. జిల్లాలో రైల్వే లైన్ భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఖర్చుచేసింది. ఆరు నెలల్లోపు సిద్దిపేట నుం డి ఎలక్ట్రీక్ లైన్ ద్వారా రైలు నడవనుంది. రానున్న రో జుల్లో సిద్దిపేట నుంచి బెంగుళూర్, తిరుపతికి ప్యాసింజ ర్ రైళ్లు నడువనున్నాయి. సిద్దిపేటకు రైలు రావడానికి స హకరించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News