Monday, November 25, 2024

ప్రభుత్వ ఆస్పత్రిలో మృత్యుఘంటికలు: 48 గంటల్లో 31 మంది రోగుల మృతి

- Advertisement -
- Advertisement -

ఔరంగాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 24 మంది రోగులు మరణించిన ఉదంతం వెలుగు చూసిన మరుసటి రోజే అక్టోబర్ 1, 2 తేదీలలో మరో ఏడుగురు రోగులు అదే ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన నాందేడ్ జిల్లా సమాచార కార్యాలయం(డిఐఓ) దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకున్నట్లు వెల్లడించింది.

నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో సెప్టెంబర్ 30, అక్టబోర్ 1వ తేదీ మధ్య 24 గంటల్లో 24 మంది రోగులు మరణించారు. వీరిలో 12 మంది శిశువులు ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నత అధికారి ఒకరు సోమవారం తెలిపారు. కాగా..జౌషధాల కొరత కారణంగానే నాందేడ్ నగరంలోని శంకర్‌రావు చవాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు శిశువులతోసహా 31 మంది రోగులు మరణించినట్లు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆరోపించారు. రోగులకు అవసరమైన మందులను, చికిత్సను అందచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ ఘోరంగా విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.

జిల్లా సమాచార శాఖ మరో సోషల్ మీడియా పోస్టులో మొత్తం 31 మంది మరణించినట్లు తెలిపింది. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల బృందం సిద్దఃగా ఉందని డిఐఓ తెలిపింది.

ఇదిలా ఉండగా, నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 12 మంది శిశువులతోసహా 24 మంది రోగులు ఒకేరోజులో మరణించడం అత్యంత బాధాకరంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని ఆయన ప్రశ్నించారు. ఔషధాల కొరత వల్ల ఈ మరనాలు జరిగినట్లు తెలుస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్షంగా ఎలా ఉండగలదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కూల్చడం, ఎమ్మెల్యేలను కొనడం, అమ్మడంలో బిజీగా ఉన్న వీరికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని ఆయన ఆరోపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News