Thursday, December 19, 2024

30 ఏళ్ల వయసులో డయాబెటిస్ 2 వస్తే 14 ఏళ్లు తగ్గనున్న ఆయుః ప్రమాణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముఫ్పై ఏళ్ల వయసులో ఎవరికైనా డయాబెటిస్ 2 సంక్రమిస్తే వారి ఆయుప్రమాణం 14 ఏళ్లు తగ్గిపోతుందని ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ అధ్యయనం వెల్లడించింది. అత్యధిక ఆదాయం కలిగిన 19 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం సాగింది. అలాగే 50 ఏళ్ల వయసులో ఎవరికైనా డయాబెటిస్ 2 సోకితే వారి ఆయుః ప్రమాణం ఆరేళ్లు తగ్గిపోతుందని అధ్యయనం వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా యువకుల్లో డయాబెటిస్ విపరీతంగా వ్యాపిస్తున్న తరుణంలో డయాబెటిస్‌ను నివారించడం కానీ లేదా వ్యాధిని మందగింప చేయడం కానీ జరిగేలా తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది. 2021 నాటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 537 మిలియన్ మంది పెద్దలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారని తేలింది. అయితే టైప్ 2 డయాబెటిస్ వల్ల గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ సమస్యలు, కేన్సర్ కూడా దాపురిస్తుంటాయి.

డయాబెటిస్ లేని వారు కన్నా డయాబెటిస్ ఉన్న పెద్దలు సరాసరిన ఆరేళ్లు ముందుగానే మరణానికి చేరువయ్యే ముప్పు ఉంటుందని గతంలో నిర్వహించిన అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో , బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం నిర్వహించారు. టైప్ 2 డయాబెటిస్ 30, 40. 50 ఏళ్ల వయసులో కనిపిస్తే సరాసరిన 14,10.6 ఏళ్ల వరకు ఆయు ప్రమాణం తగ్గుతుందని అంచనా, అలాగే మహిళల్లో ఈ రిస్కు ఎక్కువగా ఉంటోంది. 16,11,7 ఏళ్ల వయసులో వారిలో డయాబెటిస్ 2 కనిపిస్తే వారి ఆయు ప్రమాణం చాలా వరకు తగ్గుతుందని అధ్యయనం వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News