Monday, December 23, 2024

భూవివాదం… 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్ తో తొక్కించి….

- Advertisement -
- Advertisement -

లక్నో: భూవివాదం నేపథ్యంలో 60 ఏళ్ల వృద్ధుడిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నర్ఖి ప్రాంతం ఫతేపూర్‌కు చెందిన జగదీష్ అనే వ్యక్తి వేలంలో 2003లో భూమిని కొన్నాడు. గత కొన్ని రోజుల నుంచి నేత్రపాల్, ఇంద్రవీర్‌తో జగదీష్‌కు భూతగాదాలు జరుగుతున్నాయి. తహసీల్దార్ సదార్ పుష్కర్ సింగ్‌కు జగదీష్ మొర పెట్టుకోవడంతో వివాదం పరిష్కరించాలని పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. నేత్రపాల్, ఇంద్రీవీర్ అక్కడికి చేరుకొని జగదీష్‌ను ట్రాక్టర్‌తో తొక్కించడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. అక్కడ ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఎస్‌పి సర్వేష్ కుమార్ మిశ్రా అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Also Read: పాక్‌కు మొరాకో తరహా భూకంపం ముప్పు: డచ్ శాస్త్రవేత్త అంచనా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News