- Advertisement -
గ్యాంగ్‌టక్: సిక్కింలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు కురవడంతో తీస్తా నదిలో ప్రమాద స్థాయి దాటి వరదలు ముంచెత్తడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. చుంగతంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో వరద ప్రవాహం 10 అడుగుల నుంచి 20 అడుగుల వరకు చేరుకుంది. బర్దాంగ్‌లోని సింగ్టమ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాలు వరద నీటిలో గల్లంతయ్యాయి. ఉత్తర సిక్కింలో భారీ వర్షాలు కురవడంతో లోనాక్ లేక్ ఉధృతంగా అలుగు పోస్తుంది. తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీస్తా నది సిక్కిం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
- Advertisement -