Monday, December 23, 2024

న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు పుర్కాయస్థకు 7 రోజుల పోలీసు రిమాండ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనా అనుకూల ప్రచాకకర్తల నుంచి నిధులను స్వీకరించారన్న ఆరోపణలతో ఉగ్రవాద నిరోధక చట్టం(యుఎపిఎ) కింద మంగళవారం అరెస్టు చేసిన న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిలకు ఏడు రోజుల పోలీసు రిమాండుకు పంపించినట్లు బుధవారం అధికారులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి 30కి పైగా ప్రదేశాలలో మంగళవారం సోదాలు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు పలువురు జర్నలిస్టులను ప్రశ్నించి పుర్కాయస్థ, చక్రవర్తిలను అరెస్టు చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరచగా వారికి పోలీసు రిమాండు విధించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఢిల్లీలోని న్యూస్‌క్లిక్ కార్యాలయానికి పోలీసులు మంగళవారం తాళం వేశారు. 146 మంది అనుమానితులను ప్రశ్నించామని, లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లతోసహా అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నానమి, వాటిని అధ్యయనం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News