Friday, October 18, 2024

ములుగులో గిరిజన వర్సిటీకి కేంద్ర క్యాబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తెలంగాణలోని ములుగు జిల్లాలో రూ. 900 కోట్ల వ్యయంతో సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు తెలిసింది.

బుధవారం ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వర్గాలు తెలిపాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో అక్టబోర్ 1న పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ములుగులో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రూ. 900 కోట్లతో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీకి గిరిజన దేవతలు సమ్మక్క సారక్క పేర్లు పెడతామని ప్రధాని ఈ సంరద్భంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News