Friday, November 22, 2024

జల వివాదాలు పరిష్కరించిన కేంద్రానికి ధన్యవాదాలు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

జల వివాదాలు పరిష్కరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో బుధవారం కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..”కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం, తెలంగాణ మధ్య చర్చలు జరిగాయి. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాన ఉద్యమం వచ్చింది. జల వివాదాలు పరిష్కరించిన కేంద్రానికి ధన్యవాదాలు. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోంది. 2021లో రిట్ పిటిషన్ ను తెలంగాణ ఉపసంహరించుకుంది. కృష్ణా జలాల సమస్య పరిష్కరిచాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. రెండు రాష్ట్రాలతో కేంద్రం అనేకసార్లు మాట్లాడింది. సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా కేంద్రం తీసుకుంది. సొలిసిటర్ జనరల్ 2023 జులైలో న్యాయశాఖ నివేదిక ఇచ్చారు. ట్రైబ్యునల్ లో అదనపు నిబంధనలు చేర్చాలని నిర్ణయించారు. సెక్షన్ 12కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించుకోవచ్చని కేంద్రం సూచించారు. కేంద్రం నిర్ణయంతో సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలో 9.08 శాతం మంది గిరిజనులు ఉన్నారు. 2011 గణాంకాల ప్రకారం గిరిజన అక్షరాస్యత 49.51 శాతం. కేంద్ర విద్యాశాఖ ద్వారా రూ.889 కోట్లతో గిరిజన వర్సిటీ ఏర్పాటు కానుంది. గిరిజన వర్సిటీ ఏర్పాటుతో తెలంగాణలోని గిరిజనులకు లబ్ధి చేకూరుతుంది. వర్సిటీ ద్వారా గిరిజనుల హక్కులు, సంస్కృతి పరిరక్షణకు కృషి జరగుతుంది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News