Monday, December 23, 2024

‘భగవంత్ కేసరి’ నుంచి ‘ఉయ్యాలో ఉయ్యాలా’ సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ క్రేజీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘ఉయ్యాలో ఉయ్యాలా’ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ మూవీలో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా, నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. జాతీయ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సి రామ్ ప్రసాద్, ఎడిటర్ తమ్మి రాజు, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News