Monday, December 23, 2024

కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణపై తీసుకునే చర్యలపైసమగ్ర నివేదిక సమర్పించడంలో విఫలమైనందుకు కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. చీఫ్‌జస్టిస్ ప్రసన్న బి వరలే, జస్టిస్ క్రిష్ణ ఎస్ దీక్షిత్ లతో కూడిన ధర్మాసనం, తదుపరి విచారణ తేదీ నవంబర్ 2 నాటికి అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్టుమెంట్ సెక్రటరీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

బెంగళూరుకు చెందిన ఎన్‌జివొ లెట్జ్‌కిట్ ఫౌండేషన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు బుధవారం విచారణ సమయానికి రాష్ట్రప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణపై సరైన నివేదిక సమర్పించలేక పోయింది. అఫిడవిట్ సమర్పించడానికి చాలా వ్యవధిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో కోర్టు ఆగ్రహించి జరిమానా విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News