- Advertisement -
వాటికన్‌సిటీ : క్లైమెట్ విపరీత మార్పుల కట్టడి లక్షాల అమలులో ప్రపంచ నేతలు చేతకాని రీతిలో వ్యవహరిస్తున్నారని పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు. కాలం గడిచిపోతోంది. ఇప్పటికీ ప్రపంచ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోవడం సిగ్గుచేటైన విషయం అని పోప్ తెలిపారు. భూతాపం పెరుగుతూ పోయి చివరికి భర్తీచేయలేని శూన్యతను సృష్టిస్తుందని హెచ్చరించారు. వాతావరణ విపరీత మార్పులతో ఇప్పుడు ప్రపంచ పేదలు , అణగారిన వర్గాలు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తోంది. వాతావరణ పరిస్థితి పరిరక్షణపై తాను 2015లో వెలువరించిన ఆందోళననే తిరిగి మరింతగా తెలియచేస్తున్నట్లు పోప్ వివరించారు.
- Advertisement -