- Advertisement -
వెనిస్ : ఇటలీలోని వెనిస్‌లో ఓ బస్సు అదుపుతప్పి,వంతెనపై నుంచి బోల్తా పడి మంటలు అంటుకున్న ఘటనలో 21 మంది మృతి చెందారు. కనీసం 15 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధికులు విదేశీయులే ఉన్నారు. సమీపంలోని క్యాంప్‌సైట్ నుంచి బస్సు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులలో ఐదుగురు ఉక్రెయిన్లు, ఓ జర్మన్, బస్సు డ్రైవర్ ఉన్నారని అధికారులు తెలిపారు. మృతులలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వీరిలో మూడేండ్ల ఉక్రెయిన్ బాలిక కూడా ఉంది. ఓ బైపాస్ వద్ద మలుపు వద్ద బస్సు అదుపు తప్పింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సహాయక బృందాలు రాత్రంతా ఇక్కడ బస్సు వెలికితీత పనిలో ఉన్నారు.
- Advertisement -