Monday, December 23, 2024

#గోపీచంద్32 షూటింగ్ ఇటలీలో ప్రారంభం

- Advertisement -
- Advertisement -

‘మాచో స్టార్’ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 ఇటివలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్‌ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు.

భారీ బడ్జెట్‌తో లావిష్ గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా ఇటలీలో ప్రారంభమైంది.  ఇటలీ, మిలాన్ లోని  కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు.  సినిమాలో చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై అత్యుత్తమ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు.  చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇతర టెక్నికల్ టీమ్‌ను త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News