- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : నగరంలోని వందలాది బస్తీలతో వెంకటస్వామి (కాకా) జీవితం పెనవేసుకుంది. పేద ప్రజలకు ఇండ్ల కోసం స్థల సౌకర్యం కల్పించిన మహనీయుడు అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ట్యాంక్‌బండ్ వద్ద వెంకటస్వామి 94వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి కిషన్‌రెడ్డి నివాళి అర్పించారు. అనేక కార్మిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పోరాటం చేశారు. కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -