Friday, November 22, 2024

14 కమిటీలను ప్రకటించిన బిజెపి

- Advertisement -
- Advertisement -

మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఎన్నికలే లక్ష్యంగా 14 కమిటీలను బిజెపి ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్, కన్వీనర్లను నియమించింది. ఎన్నికల మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జాయింట్ కన్వీనర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలను నియమించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ చైర్మన్‌గా బండి సంజయ్, ఛార్జిషీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు, పోరాట కమిటీ చైర్మన్‌గా విజయశాంతి, కన్వీనర్‌గా డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, సోషల్ ఔట్ రీచ్ చైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, కన్వీనర్‌గా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, పబ్లిక్ మీటింగ్స్‌కన్వీనర్‌గా జి. ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఔట్రీచ్ చైర్మన్‌గా డి.కె. అరుణ, కన్వీనర్‌గా పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఛార్జ్- షీట్ ఛైర్మన్‌గా పి.మురళీధర్‌రావు, కన్వీనర్లుగా ఎండల లక్ష్మీనారాయణ,చింతల రాంచంద్రారెడ్డి, రామచంద్రుడు, స్క్రీనింగ్ కమిటీ కన్వీనర్ దుగ్యాల ప్రదీప్‌కుమార్, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా అర్వింద్ ధర్మపురి, కన్వీనర్‌గా పోరెడ్డి కిషోర్ రెడ్డి, ఎన్నికల కమిషన్ సమస్యల కమిటీ చైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, కన్వీనర్‌గా కపిలవాయి దిలీప్‌కుమార్, పార్టీ కార్యాలయం సమన్వయ కమిటీ చైర్మన్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి, కన్వీనర్‌గా శృతి బంగారు, మీడియా కమిటీ చైర్మన్‌గా ఎం. రఘునందన్ రావు, కన్వీనర్లుగా ఎన్. రామచంద్రరావు, డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా వెదిరె శ్రీరామ్, కన్వీనర్‌గా ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, ఎస్‌సి నియోజకవర్గాల సమన్వయ కమిటీ చైర్మన్ జితేంద్ర రెడ్డి, కన్వీనర్‌గా డాక్టర్ జి.విజయరామారావు, ఎస్‌టి నియోజకవర్గాలు సమన్వయ కమిటీ చైర్మన్‌గా గరికపాటి మోహన్‌రావు, కన్వీనర్‌గా సోయం బాపురావు, రవీంద్ర నాయక్‌లను బిజెపి నియమించింది.

కీలక నేతల సమక్షంలో పదాధికారుల సమావేశం..
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో పదాధికారుల జరిగింది. ఈ సమావేశానికి బిజెపి కీలక నేతలు బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్ హాజరయ్యారు. ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. శుక్రవారం కౌన్సిల్ సమావేశంలో తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిధిగా జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా హాజరుకానున్నారు.

ఘటేకేసర్‌లోని విబిఐటి కళాశాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి వెయ్యి మంది నేతలు హాజరుకానున్నారు. పదాధికారుల సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్ళులు బండి సంజయ్, ప్రకాష్ జావడేకర్, అరవింద్ మీనన్, ఇంద్రసేనారెడ్డి, ఎంపి సోయం బాపూరావు, శాసనసభ్యులు రఘునందన్‌రావు, మురళీధర్ రావు, సుధాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు ,బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి,ప్రదీప్ కుమార్, బంగారు శృతి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు పాల్గొన్నారు.

BJP Committees 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News