Monday, November 25, 2024

ఈనెల 9వ తేదీన సిడబ్ల్యూసి సమావేశం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన సిడబ్ల్యూసి సమావేశాల్లో చర్చించిన పలు అంశాల గురించి మరోమారు చర్చించాలని సిడబ్ల్యూసి  కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన సిడబ్ల్యూసి ఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, కుల గణన, త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సి వ్యూహంపై చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మధ్యప్రదేశ్‌లో బిజెపి, తెలంగాణలో బిఆర్‌ఎస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్)లు అధికారంలో ఉండగా వాటి నుంచి అధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్న అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించాలని సిడబ్ల్యూసి కమిటీ నిర్ణయించినట్టుగా సమాచారం.

దీంతోపాటు ఛత్తీస్‌ఘఢ్, రాజస్థాన్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ సమావేశానికి ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సైతం హాజరుకానున్నారు. ప్రతిపక్ష నాయకులపై కేంద్ర సంస్థలు దాడులు జరుపుతున్న సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దర్యాప్తు సంస్థల నుంచి దాడులు ఎదుర్కొంటున్న విపక్ష నాయకులకు అండగా ఉండడంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. మొత్తంగా 84 మందితో విడుదల చేసిన జాబితాలో 39మందిని సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా 18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్‌చార్జీలుగా, తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులుగా, నలుగురి ఎక్స్‌అఫిషీయో సభ్యులుగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News