హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తన గన్ మెన్ చెంప చెళ్లుమనిపించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా మహమూద్ అలీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసానిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. తన పక్కన ఉన్న గన్ మెన్ ప్లవర్ బోకే ఎక్కడ అని అడిగాడు. ప్లవర్ బోకే కనిపించకపోవడంతో గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. అనంతరం పక్కనే ఉన్న బోకెను ఇతరుల సాయంతో తీసుకున్న గన్ మెన్ దానిని హోం మంత్రికి అందించాడు. వెంటనే తలసాని కలగజేసుకొని వారించాడు. కాగా తనకు సెక్యూరిటీగా ఉండే అంగరక్షకుడిపై హోంమంత్రి చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మినిస్టర్ అయినంత మాత్రాన సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం తగదని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్టు