Monday, December 23, 2024

బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ మేడ్చెల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మబండకు చెందిన గుండాల మహిపాల్ రెడ్డి తన కాలనీలో ఉండే బాలిక(7)పై లైంగిక దాడి చేశాడు. ఇది చూసిన చుట్టుపక్కల వారు పట్టుకునేందుకు యత్నించగా పరిపోయాడు. తర్వాత నిందితుడు ఇంటికి వస్తుండగా స్థానికులు చూసి పట్టుకున్నారు. వెంటనే బాలిక తండ్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ గంగారెడ్డి దర్యాప్తు చేసి సాక్ష్యాలను కోర్టులో సమర్పించాడు. వాటిని పరిశీలించిన కోర్టు తీర్పు చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News