Monday, January 20, 2025

రెండో రోజూ కొనసాగిన ఐటి సోదాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటి సోదాలు కొనసాగాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, శంషాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటి అధికారుల సోదాలు జరిగాయి. డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండి కృష్ణ ప్రసాద్ ఇళ్ల పై రెండో రోజు కూడా ఐటి సోదాలు నిర్వహించారు. శంషాబాద్‌లోని చిట్‌ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులపై సోదాలు జరిగాయి. కూకట్‌పల్లిలోనూ హిందూ ఫార్చునాల్లో సోదాలు నిర్వహించారు. చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రెండవ రోజు కూడా ఐటి అధికారుల సోదాలు నిర్వహించి, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News