Monday, December 23, 2024

కీసరలో చెట్టును ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బెలీనో కార్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో భువేష్ (17), తుషార (18)లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

శనివారం ఉదయం కీసర చౌరస్తా నుండి యాధార్ పల్లి వైపు వెళ్తున్న సమయంలో గోశాల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను అల్వాల్ బొల్లారం ప్రాంతంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గురైన కారు నుంచి మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫుల్లుగా తాగిన మత్తులో డ్రైవ్ చేయడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News