Saturday, November 23, 2024

మాకూ 20 టికెట్‌లు కావాలని మహిళా కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో అధిష్టానాన్ని కలిసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపుల్లో రోజుకో కొత్త ట్విస్టులు ఏర్పడుతున్నాయి. పలు సామాజిక వర్గాల నుంచి రోజుకో కొత్త డిమాండ్ తెరమీదకు వస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. తమకు తగినన్ని సీట్లు కేటాయించాలని ఇప్పటికే బిసి, కమ్మ సామాజిక వర్గాల నేతలు డిమాండ్‌లు వినిపిస్తున్న నేపథ్యంలో అదే బాటలో మహిళా కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు.

తాజాగా శనివారం మహిళా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలను కలిసి మహిళా కోటా కింద 20 టికెట్‌లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు నేతృత్వంలో మహిళా నేతల బృందం శనివారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ను కలిసి తమకు 20 టికెట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో పోటీకి మహిళా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారని, క్షేత్ర స్థాయిలో మహిళా కాంగ్రెస్ బలంగా ఉందని తమకు సీట్లు ఇవ్వకుంటే తాము ప్రచారంలో పాల్గొనబోమని సునీతరావు తేల్చిచెప్పినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఢిల్లీకి వెళ్లి పెద్దలను కలిసి తమ డిమాండ్లను వినిపించడం పార్టీలో ఇంట్రెస్టుగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News