Monday, December 23, 2024

నవదీప్‌కు మళ్లీ ఈడి సమన్లు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోంటున్న సినీనటుడు నవదీప్‌కు ఈడి శనివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గుడిమల్కాపూర్ డ్రగ్స్ కేసులో సినీనటుడు నవదీప్‌ను టిఎస్ నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారణ చేసిన విషయం తెలిసిందే. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ వద్ద నుంచి నవదీప్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలియడంతో 41 నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు నవదీప్ ఐసిసిసిలోని తెలంగాణ నార్కోటిక్ బూరో ఎదుట హాజరయ్యారు.

గతంలో నవదీప్ డ్రగ్స్ విక్రేతలతో చేసిన లావాదేవీలపై వివరాలు అడిగారు. అంతేకాకుండా నవదీప్ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో అధికారులు, డాటా రిట్రీవ్ కోసం పంపించారు. మరో సారి విచారణకు పిలుస్తామని తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే నవదీప్ పల్లపోలుకు ఈడి కూడా విచారణ కోసం హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. గతంలో నమోదైన డ్రగ్స్ కేసులో కూడా నవదీప్‌ను విచారించామని ఈడి అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రెండు సార్లు సమన్లు జారీ చేసినా హాజరు కాలేదని, ఇప్పుడు మళ్లీ జారీ చేశామని తెలిపారు.
కోణంలో…
డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖలపై మనీల్యాండరింగ్ 12 కేసులు నమోదు చేసిన ఈడి అధికారులు పలువురు నటులను విచారణ చేసింది. ఇందులో నవదీప్, రకూల్‌ప్రీత్‌సింగ్, రాణా దగ్గుబాటి, రవితేజ, చార్మి కౌర్, మమైత్ ఖాన్, తనీష్, నందు, తరుణ్ ఉన్నారు. ఈ కేసులో వీరికి డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News