Monday, December 23, 2024

నేను మళ్లీ సిఎం అవుతానా?..

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఆయా పార్టీల ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం దివడోరిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చస్త్రశారు.తాను మంచి ప్రభుత్వాన్నే నడుపుతున్నానా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.‘ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానా?ఈ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ ర్యాలీకి హాజరైన ప్రజలను ప్రశ్నించారు.అంతేకాకుండా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల్లో బిజెపినే విజయం సాధించాలని కోరుకుంటున్నారా? ప్రధాని మోడీపాలన కొనసాగాలని ఆశిస్తున్నారా? అని కూడా ప్రశ్నించారు. సిఎం అడిగిన ప్రశ్నలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు.

అనంతరం ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ పోటీ చేసేందుకు తాము ప్రజల అనుమతి తీసుకుంటామని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి ఇప్పటివరకు ప్రకటించిన జాబితాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పేరు లేకపోవడంతో అధిష్ఠానం ఆయనను పక్కకు పెట్టవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రచారానికి వచ్చిన ప్రధాని మోడీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడడానికి ఆలోచిస్తున్నారని ఆరోపించారు. సిఎం పేరు ప్రస్తావించకుండానే ఓట్లు అడుగుతున్నారన్నారు.దీన్నిబట్టే శివరాజ్ సింగ్ ఓటమి చవిచూడడం ఖాయమని ప్రియాంక ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News