Friday, January 10, 2025

బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్, ఎస్ఐకి నోటీసులు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బంజారాహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీహరికి ఎసిబి అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం వరకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మామూళ్ల కోసం వేధిస్తున్నారని ఓ పబ్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఎసిబి అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 20 గంటల పాటు విచారణ చేశారు. అనంతరం ఇన్స్‌స్పెక్టర్ నరేందర్, ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీహరిపై కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు చేసిన పబ్ నిర్వాహకుడిని అర్ధరాత్రి పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ నరేందర్ పబ్ నిర్వాహకుడితో వాట్సాప్ కాల్స్ మాట్లాడిన వాటిని బాధితుడు యాప్ ద్వారా స్క్రీన్ రికార్డింగ్ చేసినట్లు తెలిసింది, వాటిని ఎసిబి అధికారులకు అందించినట్లు తెలిసింది. పబ్ వ్యవహారంతో పాటు మిగతా వసూళ్ల పైనా ఎసిబి అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పబ్‌లు, స్పా సెంటర్ల నుంచి నెలవారీగా మామూళ్లు పెద్ద ఎత్తున నరేందర్ వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇన్స్‌స్పెక్టర్ నరేందర్‌కు ఎస్సై నవీన్‌రెడ్డి, హోంగార్డు శ్రీహరి సహకరించినట్లు తెలుస్తోంది. ముగ్గురికి ఎసిబి అధికారులు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News