- Advertisement -
అమరావతి: ప్రజలకు మేలు చేసిన ప్రాజెక్టుపై నిందలు వేయడం రాజకీయ కుట్ర కాదా? అని టిడిపి నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎన్‌టిర్ భవన్‌లో టిడిపి నేత అచ్చెన్నాయుడు, ఇతర నేతలు “ఎపి ఫైబర్ ప్రాజెక్టు వాస్తవాలు-జగన్ ముఠా అబద్ధపు ఆరోపణలు” పేరిట పుస్తకం విడుదల చేశారు. నెలకు రూ.149కే ఇంటికి ఇంటర్నెట్, పోన్, టివి, ఛానళ్లకు సౌకర్వం కల్పించామన్నారు. ఎపి ఫైబర్‌నెట్ విధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని, రూ. కోట్లు ఖర్చు కళ్లముందే కనపడుతుంటే ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. జగన్ రెడ్డి ముఠా చేసే రాజకీయ కుట్ర కాక మరేమిటి అని ప్రశ్నించారు.
Also Read: ప్రపంచకప్ 2023: టీమిండియాపై బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్..
- Advertisement -