Friday, January 10, 2025

నాడు తాపిమెస్త్రీ నేడు ఫైర్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

రాజంపేట్:వారిది కూలీపని చేస్తే గాని పూట గడవని పరిస్థితి తండ్రితో పాటు తాను సైతం పని చేసి తండ్రికి చేదుడు వాదోడుగా ఉంటు చదువును కొనసాగించారు. నాడు కష్టపడ్డ ఫలితం నేడు పోలీస్ టోపితో కానిస్టేబుల్‌గా ఎంపిక కావడంతో తల్లి తండ్రులతో పాటు బందువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట్ మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎండ్రియాల బాలరాజ్ కుమారుడు నరేందర్ చదువులో ముందుండేవాడు అది గమనించిన తండ్రి బాలరాజ్ తన కుమారుడిని మంచి ప్రయోజకుడిని చేయాలనే తపనతో మంచిగా చదివించాలని అనుకున్నాడు. పరిస్థితులు అనుకులించకపోవడంతో తండ్రితో పాటు కూలీ పనితో పాటు మెస్త్రీ పని చేసుకుంటు చదువుకున్నాడు.

ఇటివల ప్రభుత్వం ఫైర్‌ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిపికేషన్ వేయడంతో ధరఖాస్తూ చేసుకున్న నరేందర్ ఒక వైపు తన పని చేసుకుంటునే పరీక్షలకు సన్నదం అయ్యాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా రోజువారి కూలీ పనులు చేసుకుంటు తన ఇంటి వద్దనే పుస్తకాలతో కుస్తి పట్టాడు. పరీక్షలలో మంచి మార్కులు సాదించి  ఫైర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. దీంతో గ్రామస్తులు నరేందర్ కష్టానికి మంచి ఉద్యోగం రావడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ సందర్బంగా నరేందర్ మన తెలంగాణతో మాట్లాడుతూ తాను లక్ష్యంతో చదివి అనుకున్న ఉద్యోగం సాధించాలనని, తనను తాను నమ్ముకొని సాధించాలనే లక్ష్యం ఉంటే మనిషి ఎదైన సాధించ వచ్చనే నమ్మకం నాకు కుదిరింది. చేడు వ్యసనాలకు బలి కాకుండా మంచి చదువులు చదువుకొని యువత లక్ష్యాన్ని ఎంచుకోవాలని అన్నారు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు, పదోన్నతుల కోసం పోటీ పడుతానని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News